Allu Arjun : ఆ రెండు సినిమాలను మరోసారి గుర్తు చేసుకున్న ఐకాన్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో బ్లాక్బాస్టర్ హిట్స్ ఉన్నాయి.. కెరీర్ ఆరంభం నుంచి అల్లు అర్జున్ మంచి హిట్లు సాధించారు.అయితే ఆయన కెరీర్ లో జనవరి 12 సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ తన కెరీర్లో సూపర్ హిట్లుగా నిలిచిన దేశముదురు, అల వైకుంఠపురములో చిత్రాలను నేడు (జనవరి 12) గుర్తు చేసుకున్నారు . నేటితో దేశముదురు చిత్రానికి 17 ఏళ్లు పూర్తవగా.. అల వైకుంఠపురంలో వచ్చి నాలుగేళ్లయింది.దేశముదురు మరియు అల వైకుంఠపురములో సినిమాలను గుర్తు చేసుకుంటూ నేడు అల్లుఅర్జున్ ట్వీట్లు చేశారు . నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండేవి అంటూ రాసుకొచ్చారు. అల వైకుంఠపుములో సినిమా షూటింగ్ సమయంలోని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా గురించి ముందుగా పోస్ట్ చేశారు . “దేశముదురు” చిత్రం వచ్చి 17 ఏళ్లు పూర్తయింది. అది చాలా అందమైన సమయం. నా డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత డీవీవీ దానయ్యకు, మూవీ యూనిట్ మొత్తానికి థ్యాంక్స్. అద్భుతంగా దీవించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.2007 జనవరి 12వ తేదీన దేశముదురు సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదగడానికి దేశ ముదురు సినిమా కీలకపాత్ర పోషించింది. ఈ మూవీతోనే సిక్స్ ప్యాక్స్ ట్రెండ్ టాలీవుడ్ కు పూరిజగన్నాధ్ తీసుకు వచ్చారు.. ఈ చిత్రంతో అల్లు అర్జున్‌కు మాస్ ఇమేజ్ వచ్చింది. యాక్షన్, డ్యాన్స్ మరియు మాస్ డైలాగ్స్ ఇలా ఈ చిత్రంలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించింది. దేశ ముదురు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బాస్టర్ హిట్ అయింది.అలాగే 2020 జనవరి 12న విడుదలైన అల వైకుంఠపురములో చిత్రానికి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. అల్లు అర్జున్ కెరీర్లో ఈ చిత్రం కూడా బ్లాక్బాస్టర్ హిట్ అయింది. “అల వైకుంఠపురం చిత్రం వచ్చి 4 సంవత్సరాలు పూర్తి అయింది . అందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ సహా టీమ్‌తో కలిసి అల వైకుంఠపురంలో షూటింగ్ సమయంలో దిగిన మూడు ఫొటోలను కూడా అల్లుఅర్జున్ పోస్ట్ చేశారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ అలాగే అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా ఎంతో హైలైట్ గా నిలిచింది.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
17 years of #Desamuduru Movie . What a beautiful moment in time . Thanks to my director @PuriConnects , my producer @DVVMovies and the entire cast & crew . Gratitude forever to my fans and audience for a memorable blessing 🙏🏽
— Allu Arjun (@alluarjun) January 12, 2024
4 years of AVPL . The sweetness still remains in my heart . Thanks to all of you … for such a memorable blessing. Gratitude forever 🙏🏽 pic.twitter.com/VcnnlGUsER
— Allu Arjun (@alluarjun) January 12, 2024
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!