Site icon NTV Telugu

Allu Arjun:స్నేహారెడ్డికి బన్నీ కాస్ట్లీ సర్ప్రైజ్.. 15వ యానివర్సరీ గిఫ్ట్ ఏంటో తెలుసా?

Allu Sneha Reddy New Car

Allu Sneha Reddy New Car

టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్ – స్నేహారెడ్డి మార్చి 6న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున బన్నీ తన భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా రూ. 1.5 కోట్లు విలువ చేసే సరికొత్త మెర్సిడెస్ బెంజ్ (Mercedes-AMG CLE 53) కారును స్నేహకు బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ కారును గిఫ్ట్‌గా ఇస్తున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. అల్లు అరవింద్ , పిల్లలు అయాన్, అర్హ సమక్షంలో బన్నీ ఆ కారు కీస్‌ను స్నేహకు అందజేశారు. కారును చూడగానే స్నేహ మొహంలో వచ్చిన ఆనందం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Also Read: Funky: విశ్వక్ సేన్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఈసారి అల్లు ఫ్యామిలీలో వేడుకలు డబుల్ అయ్యాయి. ఒకవైపు బన్నీ – స్నేహల 15వ యానివర్సరీ.. అదే రోజున తమ్ముడు అల్లు శిరీష్ వివాహం కూడా జరగడంతో అల్లు వారి ఇంట సందడి మాములుగా లేదు. బన్నీ సోషల్ మీడియాలో స్నేహను ‘Cutie’ అని పిలుస్తూ.. “నీ తోడు లేకపోతే ఈ 15 ఏళ్ల ప్రయాణం ఇంత అందంగా ఉండేది కాదు” అంటూ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Exit mobile version