Site icon NTV Telugu

AA25 : ధురంధర్ హీరో కథతో ఐకాన్ స్టార్?

Aa 27 (2)

Aa 27 (2)

‘పుష్ప’ చిత్రంతో తన విశ్వరూపం చూపించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్‌కమింగ్ ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ అగ్ర దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్‌లతో భారీ చిత్రాలను లైన్‌లో పెట్టిన బన్నీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ ఏప్రిల్ 8న బర్త్ డే గిఫ్ట్‌గా ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఇక అట్లీ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇమ్మీడియెట్‌గా లోకేష్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు.

Also Read : RC17 : చరణ్ – సుకుమార్ సినిమా నుండి దేవిశ్రీ అవుట్.. రంగంలోకి ధురంధర్ సెన్సేషన్?

అయితే లోకేష్ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఉంటుందనే టాక్ ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘మిన్నల్ మురళి’ వంటి అద్భుతమైన సూపర్‌హీరో చిత్రాన్ని తెరకెక్కించిన బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 25వ చిత్రాన్ని చేయబోతున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో కూడిన ఈ సినిమా ‘సూపర్ హీరో’ కథాంశంతో రూపొందనుందని సమాచారం. దీనికి మైథాలజీ టచ్ కూడా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో దర్శకుడు బసిల్ జోసెఫ్ ఇదే స్క్రిప్ట్‌ను బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు వినిపించారని కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని సమాచారం. ఇప్పుడు అదే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Exit mobile version