Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ లో ‘శివగామి’.. ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raaka: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించింది చిత్ర బృందం. ఈ సినిమాకు ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
READ ALSO: Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్ కథానాయికగా నటిస్తుండగా, తాజాగా ‘శివగామి’ రమ్యకృష్ణ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని సమాచారం. బాహుబలి లాంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్యకృష్ణ శివగామి అనే పవర్ పుల్ పాత్రలో తన నటనతో హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అట్లీ సినిమాల్లో మహిళా పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ ఫాంటసీ డ్రామాలో శివగామి పోషించబోయే రోల్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లుక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తోడేలు గెటప్‌లో, గుండుతో ఉన్న బన్నీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సంస్కృతంలో ‘రాకా’ అంటే ‘పూర్ణ చంద్రుడు’ అని అర్థం. ఒక ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో హై-లెవల్ వీఎఫ్ఎక్స్ (VFX) తో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీకి ఉన్న క్రేజ్, అట్లీకి ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డ్‌తో ‘రాకా’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!