ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి టైటిల్ ను నేడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఏప్రిల్ 8న అనగా ఈ రోజు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేసారు.
Also Read : Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ‘ రాకా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో ఒక తోడేలును పోలిన జంతువు చేయితో అదిరగొట్టే గెటప్ లో అల్లు అర్జున్ కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ భయంకరంగా కనిపిస్తోంది. ఈ ఇంటెన్సివ్ పోస్టర్ చూస్తుంటే.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది కూడా అంతుబట్టకుండా ఉంది. కానీ, సూపర్ హీరో కథతో అట్లీ ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. దీనిని బట్టి చూస్తే అట్లీ ఈ సారి రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే నటిస్తుండగా కోలీవుడ్ సెన్సషన్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.
