Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యంగా సమంత తన రాబోయే చిత్రం ‘మా ఇంటి బంగారం‘ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సామ్ ఒక మధ్యతరగతి మహిళగా కనిపిస్తూనే అనూహ్యమైన రీతిలో పోరాటాలు చేయబోతోంది. ఈ సినిమా కోసం ఆమె బాడీ డబుల్ లేదా డూప్‌ను ఉపయోగించేందుకు ఏమాత్రం అంగీకరించలేదట. చీరకట్టులో ఉండి కూడా బస్సులో ఫైట్స్ చేయడం గన్స్‌తో షూట్ చేయడం వంటి కఠినమైన సీన్స్ స్వయంగా చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. మే 15న ఈ చిత్రం విడుదల కానుంది.
రష్మిక ‘మైసా’ రిస్క్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా తన ఇమేజ్ను పూర్తిగా మార్చేస్తోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న ‘మైసా‘ చిత్రంలో ఆమె ఒక గోండు గిరిజన యువతిగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం రష్మిక బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంది. షూటింగ్ సమయంలో సుమారు 80 అడుగుల ఎత్తు నుండి జంప్ చేసే రిస్కీ సీన్‌ను డూప్ లేకుండా చేసి చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపరిచింది. తాజాగా సెట్స్ నుండి ఆమె చేతికి గాయమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మలయాళీ భామ సంయుక్త మీనన్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘స్వయంభు‘ కోసం ఆమె యుద్ధ విద్యలు నేర్చుకుంది. షూటింగ్ సమయంలో చిన్న చిన్న గాయాలైనా ఏమాత్రం విరామం తీసుకోకుండా వర్క్ పూర్తి చేస్తూ తన డెడికేషన్‌ను చాటుకుంటోంది. ‘విరూపాక్ష’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత ఆమె చేస్తున్న ఈ పీరియడ్ వార్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి మన హీరోయిన్లు కేవలం అందంతోనే కాదు సాహసాలతోనూ బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమయ్యారు.
Also Read
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!