NTV Telugu Site icon

Puspa 2 Movie Event: ముంబైలో స్టేజి పైనే రెచ్చిపోయిన ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్

Puspa 2

Puspa 2

Puspa 2 Movie Event: కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. భారతదేశంలోని సినీ పరిశ్రమలు ఎంతో ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా చాలా జోరుగా సాగుతున్నాయి. మరోవైపు సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు మూవీ మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా నుండి వచ్చిన పాటలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సినిమా ట్రైలర్ సాంగ్స్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ముంబై నగరంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్.

Also Read: IND vs AUS BGT: రెండో టెస్టుకు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్.. భారత్‌కు అడ్వాంటేజ్ కానుందా

పుష్ప 2 ఈవెంట్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హాజరయ్యారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఇరువురు సమాధానాలు ఇచ్చారు. ఇక ప్రశ్న జవాబుల అనంతరం ఈవెంట్ ఆఖరిలో ఫాన్స్ కోరిక మేరకు వారిద్దరు పుష్ప 2 సినిమాలోని సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘సూసేకి’ పాటకు సంబంధించి స్టేజి పైన స్టెప్పులు వేసి అలరించారు. దీంతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. ఈ డాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ముంబైలో జరిగిన ఈవెంట్ కు రష్మిక మందన్న బ్లాక్ డ్రెస్ లో వచ్చి కిరాక్ లుక్స్ తో అదరగొట్టింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Show comments