Site icon NTV Telugu

Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. బడా నిర్మాత సంచలన కామెంట్స్!

Allu Aravind

Allu Aravind

Allu Aravind: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత, అగ్రహీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1970 నాటి నుండి తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటూ, అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఆయన.. నిర్మాతగానే కాకుండా వ్యాపారవేత్తగా, పరిశ్రమలో కీలక వ్యక్తిగా నిలిచారు. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ సమస్యలపై తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేయడంలో కూడా అల్లు అరవింద్ ఎప్పుడూ వెనకడుగు వేయరు.

Hyderabad: హైదరాబాద్‌లో ఫారెన్‌ అమ్మాయిలతో వ్యభిచారం.. ఈ వెబ్‌సైట్ల ద్వారా ట్రాప్ చేసి..

ఇకపోతే తాజాగా జరిగిన సైమా ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు ఈ ఏడాది మొత్తం 7 జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించింది” అని అన్నారు. అలాగే ఆయన, ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే… అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో ఇండస్ట్రీలో ఐక్యత లేకపోవడంపై మళ్లీ చర్చ మొదలైంది.

Hyderabad Crime: కొందరికి సింబల్‌గా “గన్‌”.. ఈ ముఠాకు వాళ్లే టార్గెట్..!

సైమా అవార్డ్స్ వేడుకలో తెలుగు సినిమాల ప్రతిభను ముందుగానే గుర్తించి సత్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, పరిశ్రమలో ఐక్యత అవసరాన్ని అల్లు అరవింద్ గట్టిగా నొక్కి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Exit mobile version