NTV Telugu Site icon

Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్!

Aa Okkati Adakku

Aa Okkati Adakku

Allari Naresh’s Aa Okkati Adakku Movie Theatrical Rights: ‘అల్లరి నరేశ్’ కామెడీ సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ఇటీవలి కాలంలో నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి యాక్షన్ చిత్రాలు చేశారు. దాంతో నరేశ్ మళ్లీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారా? అని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో మళ్లీ తన మార్క్ కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంను నూతన దర్శకుడు అంకం మల్లి తెరకెక్కించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ చిలక ఈ సినిమాను నిర్మించారు. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఏప్రిల్ 19న ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసింది. తెలంగాణ, ఏపీ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ దక్కించుకుంది. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవల జతకట్టిన విషయం తెలిసిందే.

Also Read: Goud Saab Movie: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్‌గా టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్!

ఆ ఒక్కటి అడక్కు సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రను ఈ చిత్రంలో అల్లరి నరేశ్ పోషించారు.