NTV Telugu Site icon

Ugram Twitter Review : అల్లరోడు ఉగ్రరూపం చూపించాడుగా

Ugram

Ugram

అల్లరి నరేష్‌ అంటేకామెడీకి కేరాఫ్‌ అడ్రాస్ గా నిలిచాడు. కామెడీ మూవీలతో హీరోగా ఎదిగి నవ్వులు పూయించిన ఆయనకి ఇప్పుడు ఆ కామెడీనే వర్కౌట్‌ కావడం లేదు. అందుకే ఆయన తనని తాను మార్చుకోవాల్సి వచ్చింది. సీరియస్‌ లుక్‌లోకి టర్న్ తీసుకుని చేసిన `నాంది` భారీ విజయాన్ని సాధించింది. ఇక నాంది సినిమా హిట్‌ తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన మరో చిత్రం ‘ఉగ్రం’. మీర్నా మీనన్‌ హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటించింది. తాజాగా ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అసలు ఉగ్రం కథేంటి? ఎలా ఉంది? అల్లరి నరేశ్ యాక్షన్‌పై తమ అభిప్రాయాలను ట్విటర్‌లో పంచుకుంటున్నారు. నాంది తర్వాత యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం.

Also Read : Astrology : మే 05, శుక్రవారం దినఫలాలు

ఉగ్రం సినిమాలో అల్లరి నరేశ్ యాక్షన్‌ అదిరిపోయిందని ట్విట్టర్ లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో క్లైమాక్స్, ఫైట్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ విశ్వరూపం చూపించాడని ట్విటర్ వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం అల్లరి నరేష్ ముఖ్యంగా క్లైమాక్స్ ఫర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంటూ ట్విట్టర్ వేదికలో తెలుపుతున్నారు. బీజీఎం కొన్ని సీన్స్‌లో డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందనగా.. సెకండాఫ్‌లో గూస్‌బంప్స్‌ ఖాయమంటున్నారు. ఉగ్రం సినిమాలో అల్లరి నరేశ్ యాక్షన్ వేరే లెవెల్‌లో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : Asaduddin Owaisi: నేను “అల్లాహు అక్బర్” చెప్పమంటే ఎలా ఉంటుంది..? “జైభజరంగబలి”పై ఓవైసీ కామెంట్స్

Show comments