టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో వరుసగా కామెడీ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన అల్లరి నరేష్ రూటు మార్చి నాంది , ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు .ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్నపక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యాక్షన్ సినిమాలతో అదరగొట్టిన అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి .
రీసెంట్ గా రిలీజ్ అయినా “ఆ ఒక్కటి అడక్కు” టీజర్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.అలాగే నేడు ఈ సినిమా ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని గ్రాండ్ గా లాంచ్ చేసారు..ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది .నరేష్ కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.ఇదిలా ఉంటే ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ యాంకర్ సుమ ఇంటర్వ్యూ లో అల్లరి నరేష్ పాల్గొన్నారు .ఈ మూవీ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం నేను చేసే ఈ మూవీలో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంత చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయాలనీ ఈ సినిమా చేశానని నరేష్ తెలిపారు .ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా మంచి ఫ్యామిలీ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నరేష్ తెలిపారు .
