NTV Telugu Site icon

Amaravathi: రాష్ట్రంలోని పత్తినంతా కొనుగోలు చేయాలి.. కేంద్రానికి మంత్రులు లేఖ

Acchenna

Acchenna

రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మంత్రులు స్పష్టం చేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్కు, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో పత్తిలో వ్యర్థాల తొలగింపు, రైతులకు అధిక ధర లభ్యంపై జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లరు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయం విద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత సమావేశమయ్యారు.

Mehbooba Mufti: నేను కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేయను.. మెహబూబా ముఫ్తీ షాకింగ్ నిర్ణయం.. కారణం ఇదే..

పత్తిలో వ్యర్థాల వల్ల ధర తగ్గుముఖంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో 2017-18లో 20.50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరగ్గా.. 2023-24లో 11.58 లక్షల బేళ్ల ఉత్పత్తికి తగ్గిపోయిందన్నారు. ప్లాస్టిక్, గోనె సంచుల్లో పత్తిని ప్యాకింగ్ చేయడం వల్ల జిన్నింగ్ సమయంలో వ్యర్థాలు బయట పడుతున్నాయన్నారు. దీనివల్ల పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ధర కూడా తగ్గుతోందని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. పత్తి సేకరణ సమయంలో కాటన్ సంచులు వాడకం వల్ల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పడే అవకాశం ఉండదన్నారు. ఇందుకు వ్యవసాయ శాఖాధికారులు రైతుల్లో అవగాహన కల్పించాలని మంత్రి సవిత సూచించారు.

JK Floods: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరి పిల్లలతో ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లి

వంద శాతం ఈ క్రాప్ తో పత్తి రైతులకు మేలు: మంత్రి అచ్చెన్నాయుడు
ఈ క్రాప్లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్రాప్ లో నమోదు చేసిన పంటనంతా సీసీఐ కొనుగోలు చేయాలని ఆ సంస్థ ప్రతినిధికి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ క్రాప్ లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ధిపొందొచ్చునని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతిమంగా రైతులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వెల్లడించారు. పత్తి దిగుడులు పెంపుదల, వ్యర్థాల నివారణపై మహారాష్ట్ర, తెలంగాణలో పరిస్థితులు అధ్యయనం చేసి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పత్తి సేకరణలో ప్లాస్టిక్ వినియోగంపై నివారణకు జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లు ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. పత్తి రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పత్తి సాగులో అధిక ఉత్పత్తికి మేలైన వంగడాలు రూపొందించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయం విద్యాలయం శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు.