చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారు, హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటలా వారి సహకారంతో, విశాఖపట్నంలో రేపు, అంటే 30 జూలై 2023 నాడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించటానికి సర్వం సిద్ధం చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న సినిమా పరిశ్రమ కార్మికుల కుటుంబ సభ్యులు అందరూ ఈ క్యాంపువల్ల తగిన ప్రయోజనం పొందవచ్చు. విశాఖపట్నంలోని ఐఐఏఎమ్ బిజినెస్ స్కూల్ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆ క్యాంప్ జరుగుతుంది.
Read Also: Traffic: హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం.. ఆ రూట్లో వెళ్తే అంతే సంగతి..
ఆరోగ్య పరిరక్షణ రంగంలో ఇప్పుడు కాన్సర్ వల్ల ఎదురవుతున్న సవాళ్లు అనేకంగా ఉంటున్నాయి. ఫలితంగా ప్రాథమిక దశలో క్యాన్సర్ రె గుర్తిస్తే, చికిత్స పరంగా అంతటి మేలు జరిగి, అనేక ప్రాణాలను రక్షించగల అవకాశం ఉంటుంది. నాణ్యమైన వైద్య, ఆరోగ్య పరిరక్షణలను అందిస్తున్న స్టార్ హాస్పిటల్స్ వారు మన సమాజంలో క్యాన్సర్ మహమ్మారి ప్రమాదాన్ని తగ్గించడానికి క్యాన్సర్ ను తొలి దశల్లోనే గుర్తించటం.. ఆవశ్యకమని విశ్వసిస్తున్నారు. వేలాది మంది జీవితాలలో గుణాత్మకమైన ప్రభావం చూపడానికి ఈ ఉచిత క్యాన్సర్ క్యాంపు నిర్వహించటం జరుగుతోంది.
Read Also: Kim Kardashian: బాబోయ్.. కిమ్ కర్దాషియన్ హ్యాడ్ బ్యాగ్ ధర అన్ని కోట్లా?
ఈ అవాంఛనీయ ప్రభావాల నుంచి కాపాడుకోవడానికి క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించటం అత్యంత అవసరం. జూన్ 16న జరిగిన ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో మెగాస్టార్ చిరంజీవిగారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్లను నిర్వహించటం, తద్వారా క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యసదుపాయాలు అందించటం ఆవశ్యకత గురించి ఉద్ఘాటించారు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన మొట్టమొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లో అనేకమంది పాల్గొని విజయవంతం చేయటంతో, ఇప్పుడు విశాఖపట్నంలో ఈ మొట్టమొదటి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించటానికి నిర్వాహకులకు స్ఫూర్తిగా నిలిచింది.
Read Also: VHP Rally: వీహెచ్‌పీ ర్యాలీ హింసాత్మకం.. వాహనాలకు నిప్పు.. పోలీసుల కాల్పులు
ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లో నోటి కాన్సర్ (ఓరల్ క్యాన్సర్), రొమ్ము కాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల గుర్తింపునకు స్క్రీనింగ్ జరుగుతుంది. ఆంకాలజీతో పాటు సంబంధిత రంగాలకు చెందిన పలువురు వైద్యనిపుణులు అందుబాటులో ఉంటారు. అవసరం ఉన్నవారికి వ్యక్తిగత సలహాలను అందిస్తూ, తగు సూచనలు చేస్తారు. ఈ క్యాంపులో పాల్గొన్నవారికి క్యాన్సర్ నిరోధం గురించి, క్యాన్సర్ చికిత్స గురించి పూర్తి అవగాహన ఏర్పడి, తొలిదశల్లోనే తగు జాగ్రత్తలు తీసుకుని, వారు తమ జీవితాలలో వెలుగును నింపుకోవచ్చు.
Read Also: Pomegranate: దానిమ్మ గింజలను రాత్రి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ గురించి వివరాలు తెలిసిన మాన్యులు, పెద్దలు, స్థానికులు ఎందరో ఈ క్యాంప్ సదుద్దేశ్యాలను గుర్తించి, తమ పూర్తి మద్దతును ప్రకటించి, సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ ఉద్యమం సఫలం కావడంలో తోడ్పాటును అందిస్తున్న వీరందరికీ మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం వారు తమ కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నారు.
Read Also: Vikarabad: రూ.50 కోసం హత్య చేసిన కేసులో నిందితుడికి రూ.1000 జరిమానా
ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లో క్యాన్సర్ బారిన పడిన బాధితులకు తదుపరి చికిత్సావకాశాలను – వివరించి, పలు సలహాలను ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్లను ఒక క్రమపద్ధతిలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలు, నగరాలలో జరుపనున్నామని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నంలో రేపు, అనగా, 30 జూలైన జరుగనున్న క్యాన్సర్ క్యాంప్ – విజయవంతం అవుతుందనీ, సమాజంలో మరింత మంది ఆరోగ్య పరిరక్షణ యజ్ఞంలో మరింత దోహదం చేస్తుందనీ, నిర్వాహకులు విశ్వసిస్తున్నారు. అదనపు సమాచారంకోసం, రేపటి క్యాంప్ నకై రిజిస్ట్రేషన్ కై – చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారి అధీకృత వైబ్ సైట్ లేదా స్టార్ హాస్పిటల్స్ వారిని సంప్రదించవచ్చు.