ఐపీఎల్ ఫైనల్……. ఇంకా కొన్ని గంటల్లో ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. మొదటి క్వాలిఫయర్ లో గెలిచి ఆర్సీబీ ఫైనల్ ల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ముంబైపై ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దే కీలక పాత్ర. మ్యాచ్ ఓటమి అంచున ఉండగా, అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్ తో ముంబైకి చుక్కలు చూపించాడు. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత అయ్యర్ సారధ్యంలో పంజాబ్ టైటిల్ రేసులో నిలిచింది.
Also Read:Bala Veeranjaneya Swamy: గంజాయి బ్యాచ్‌పై చర్యలు తీసుకోవడం తప్పా జగన్..? ఏం సందేశం ఇస్తున్నారు..?
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ రెండోసారి టైటిల్ మ్యాచ్ లో పాల్గొంటుంది. ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్ కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ని చూడబోతున్నాం. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. విరాట్ కొద్దిసేపు క్రీజులో ఉంటే పంజాబ్ బౌలర్లు అతనిని అవుట్ చేయడం అంత ఈజీ కాదు. కోహ్లీ క్రీజులో కుదురుకున్నాక అతడిని అవుట్ చేయాలంటే పంజాబ్ బౌలర్లకు తలకుమించిన భారంగా మారుతుంది. మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ ఫాదర్ యోగరాజ్ కింగ్ కూడా ఇదే విషయాన్నీ చెప్తున్నాడు.
Also Read:RCB vs PBKS: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ఫైనల్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
పంజాబ్ కింగ్స్ బౌలర్లు విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేయాలి. ఒన్స్ కోహ్లీ స్టాండింగ్ ఇస్తే అతన్ని అవుట్ చేయడం అంత తేలిక కాదు. విరాట్ కోహ్లీ ని అవుట్ చేయకపోతే ఆర్సీబీ ఎంతటి టార్గేట్నైనా ఈజీగా ఛేదిస్తుంది. ఒకవేళ కోహ్లీ ఈ మ్యాచ్ లో చివరివరకు ఆడితే ఆర్సీబీ 200 కాదు మూడు వందల టార్గెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. విరాట్ కోహ్లీ 10 ఓవర్లలోపు అవుట్ అయితేనే పంజాబ్ కు గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే పంజాబ్ ని తక్కువ అంచనా వేయకూడదన్నాడు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉంటె పంజాబ్ లో శ్రేయస్ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇన్ని చెప్పిన యోగరాజ్.. ఫైనల్లో పంజాబ్ గెలవాలని కోరుకున్నాడు. వాళ్ళు పంజాబి కావడంతో ఫైనల్ పోరులో పంజాబ్ గెలిస్తే చూడాలని ఉందని చెప్పాడు.
