యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. ఇందులో బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో అలియా భట్ అతిగా జోక్యం చేసుకోవడం గొడవకు దారితీసిందట. డైరెక్షన్‌లో వేలు పెట్టడమే కాకుండా, సీనియర్ నటుడైన బాబీ డియోల్‌కు కూడా సలహాలు ఇవ్వడంతో ఆయన సహనం నశించిందని సమాచారం. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో బాబీ డియోల్ సెట్స్ నుంచి వెళ్లిపోయారని, దీనివల్ల షూటింగ్ ఆగిపోయి నిర్మాత ఆదిత్య చోప్రాకు కోట్లల్లో నష్టం వాటిల్లిందని బాలీవుడ్ టాక్.
Also Read : Suriya – Jyotika: ఆమె లేకపోతే పెళ్లే వద్దన్నాడు.. సూర్య లవ్ స్టోరీలో అసలు నిజాలు చెప్పిన తండ్రి శివకుమార్!
ఇప్పటికే వరుస సినిమాలతో నష్టాల్లో ఉన్న ఆదిత్య చోప్రా, ఈ గొడవను సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. అయితే ఈ సినిమా థియేటర్ల కంటే నేరుగా ఓటీటీలోనే బెటర్ అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ అంటే వందల మంది పని, వేల కోట్ల బడ్జెట్. అలాంటి చోట ఇద్దరు స్టార్స్ మధ్య ఈగో వార్ మొదలైతే అది నిర్మాతలకు తలనొప్పిగా మారుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’ సెట్స్‌లో ఇదే జరిగిందని సమాచారం. తన నటనతో అందరినీ మైమరిపించే అలియా భట్, ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ మధ్య జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సీనియర్ నటులకు రెస్పెక్ట్ ఇవ్వలేదనే కారణంతో బాబీ డియోల్ ఆగ్రహం వ్యక్తం చేయగా, అది కాస్తా షూటింగ్ నిలిచిపోయే వరకు వెళ్లిందని తెలుస్తోంది.
