NTV Telugu Site icon

Alia Bhatt Jigra : తెలుగులోకి కూడా రాబోతున్న ఆలియా లేటెస్ట్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే ?

New Project (13)

New Project (13)

Alia Bhatt Jigra : బాలీవుడ్‎లో టాలెంటెడ్ స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. మరి తెలుగులో సెన్సేషనల్ చిత్రం “RRR” తో ఆమె పరిచయం అయింది. అలాగే మరో చిత్రం “గంగూబాయి కతియావాడి” సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇంకా సోషల్ మీడియాలో కూడా తెలుగు ఆడియెన్స్ కి ఆలియా సుపరిచితురాలే. అయితే ఈమె నటించిన తాజా చిత్రం “జిగ్రా”. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేదాంగ రైనా సినిమలో మేల్ లీడ్ లో నటించాడు. అలాగే దర్శకుడు వాసన్ బాల తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఇన్ని రోజులు కేవలం హిందీ భాషలోనే తీసుకొస్తున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం హిందీ సహా తెలుగులో కూడా రిలీజ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. తెలుగులో పోస్టర్స్ కూడా బయటకి వచ్చాయి. ఈ సినిమా హిందీ, తెలుగులో కూడా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది.

Read Also:Metro Deluxe Buses: టీజీఎస్‌ ఆర్టీసీ కొత్తరూల్‌.. మెట్రో డీలక్స్‌ బస్సుల్లో స్టాఫ్‌ నాట్‌ అలోడ్‌..

ఆలియా భట్‍కు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తెలుగులో ఆమె మరింత ఫేమస్ అయింది. ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. తెలుగు డబ్బింగ్‍లోనూ రానుంది. జిగ్రా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ సంస్థ దక్కించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. జిగ్రా తెలుగు పోస్టర్‌ను సెప్టెంబర్ 28 ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

Read Also:Khushbu Sundar : ఇతనే నా హీరో.. అతడి మాస్ ను ఎవరు టచ్ చేయలేరు..

జిగ్రాను తెలుగులో నిర్మాతలు సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేశ్‍కు చెందిన ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో ఈ మూవీపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. “ధైర్యం, రక్షణకు సంబంధించిన స్టోరీ ఇది. బిగ్‍స్క్రీన్‍లపై చూసేందుకు రెడీగా ఉండండి. జిగ్రా తెలుగు ట్రైలర్ సెప్టెంబర్ 29న వస్తుంది. అక్టోబర్ 11న హిందీ, తెలుగులో జిగ్రా రిలీజ్ కానుంది” అని ఆ సంస్థ పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో ఆలియా భట్‍, వేద్‍నాగ్ రైనాతో పాటు ఆదిత్య నంద, శోభితా ధూళిపాళ్ల, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ కీలకపాత్రలు పోషించారు. జిగ్రా మూవీకి నిర్మాతల్లోనూ ఒకరిగా ఆలియా భట్ ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‍షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షహీన్ భట్, సౌమెన్ మిశ్రా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి అంచిత్ తక్కర్ సంగీతం అందించగా.. స్వప్నిల్ ఎస్ సోనావానే సినిమాటోగ్రఫీ చేశారు.