NTV Telugu Site icon

Paytm Payments Bank: పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూజర్స్ కి అలర్ట్.. త్వరలో కొన్ని ఖాతాలు డీయాక్టివేట్..

Paytm

Paytm

పేటీఎం పేమెంట్ బ్యాంక్.. వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. త్వరలో కొన్ని ఖాతాలను డీయాక్టివేట్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ హెచ్చరిక జారీ చేసింది. ఖాతా బ్యాలెన్స్, ఖాతా వినియోగం ఆధారంగా కంపెనీ కొన్ని ఖాతాలను శాశ్వతంగా మూసేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అధికారిక నోటీసు హెచ్చరికను జారీ చేయడం ద్వారా కంపెనీ ఈ విషయాన్ని వినియోగదారులకు తెలియజేసింది. ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్న లేదా వాలెట్ యాక్టివ్‌గా లేని యూజర్లను డీయాక్టివేట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను కూడా డీయాక్టివేట్ చేస్తున్నారు. జూలై 20న కంపెనీ అటువంటి ఖాతాలన్నింటినీ శాశ్వతంగా మూసివేస్తుంది. అటువంటి ఖాతాదారులకు కంపెనీ 30 రోజుల ముందుగానే సమాచారం ఇస్తోంది.

READ MORE: IAS Officers Transferred: తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లను బదిలీలు..

కంపెనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటోంది?
వాస్తవానికి, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఖాతాకు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటోంది. మార్చిలో జారీ చేసిన ఆర్‌బీఐ మార్గదర్శకాలలో.. పీపీబీఎల్ ఖాతాలు కొత్త డిపాజిట్లను స్వీకరించడం.. కొత్త ఖాతాలను తెరవడాన్ని ఆర్బీఐ నిషేధించింది. ఈ నిర్ణయం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కి మార్చి 15 నుంచి వర్తిస్తోంది. అయితే, కొత్త నిబంధనలు పాత కస్టమర్ల లావాదేవీలు లేదా ఇతర బ్యాంకులకు బదిలీలపై ప్రభావం చూపవు.

READ MORE: DGP Ravi Gupta: ట్రాఫిక్ నియంత్రణపై NSS వాలంటీర్లకు శిక్షణ.. నేడు మొదటి బ్యాచ్..

పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను తిరిగి ఎలా యాక్టివేట్ చేయాలి..?
డీయాక్టివేట్ చేయబడిన పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే ఇలా చేయండి. మొదటగా పేటీఎం మొబైల్ యాప్‌ని ఇన్ స్టాల్ చేయండి. యాప్‌ను ఓపెన్ చేసి మీరు PPBL విభాగాన్ని ఎంచుకోండి. అక్కడున్న వాలెట్ చిహ్నంపై నొక్కండి. ఇక్కడ Your Wallet is Inactive అనే సందేశం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు యాక్టివేట్ వాలెట్‌పై క్లిక్ చేయండి. ప్రాంప్ట్‌లను అనుసరించండి.