NTV Telugu Site icon

AP Heat Wave: ఏపీకి అలర్ట్.. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు

Imd

Imd

ఏపీ ప్రజల్ని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 113 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Read Also: Hero Vishal: 2026 ఎన్నికలే టార్గెట్గా రాజకీయాల్లోకి స్టార్ హీరో విశాల్..!

రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(31) :-
పార్వతీపురంమన్యం 10, శ్రీకాకుళం 9, విజయనగరం 8, అల్లూరి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి గోకవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(139) :-
శ్రీకాకుళం 17 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 3, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 18, కాకినాడ 16, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 11, కృష్ణా 3, ఎన్టీఆర్ 5, గుంటూరు 2, పల్నాడు 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

Read Also: LSG vs KKR: కోల్కతా ముందు మోస్తరు లక్ష్యం.. ఎంత స్కోరు చేశారంటే..?

మరోవైపు.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు తాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Show comments