Akkineni Nagarjuna: టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరు, అభిమానులు టాలీవుడ్ కింగ్ గా పిలుచుకునే అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం.. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఇలా నటులు పిటీషన్ దాఖలు చేయడం కొత్తగా ఏమి కాదు. పర్శనాలిటీ రైట్స్ కోసం గతంలో కూడా ఢిల్లీ హైకోర్టును అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరుల బాలీవుడ్ నటులు ఆశ్రయించారు.
సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హీరో అక్కినేని నాగార్జున పిటీషన్ ను జస్టిస్ తేజస్ కారియా విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తీర్పును ఇచ్చారు. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతాం అని తీర్పు ఇచ్చింది హై కోర్ట్.
Maharastra: ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక స్టూడెంట్ ఆత్మహత్య
తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, పేరు ఉపయోగించి వెబ్ సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్ వేశారు నాగార్జున. నాగార్జున పేరుతో AI వీడియోలు, పెయిడ్ ప్రమోషన్స్, హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయడాన్ని ఆపాలని.. అలాగే పేరు, ఫోటోలు దుర్వినియోగం చేయడాన్ని ఆపాలని కోరిన నాగార్జున తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇంకా పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ , లింక్స్ క్రియేట్ చేశారని తెలిపారు. టీ షర్టులపై నాగార్జున పేరు ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నారని.. ఫోటో తో AI జనరేటర్ కంటెంట్ వీడియోలు తయారు చేస్తున్నారని వివరించారు. ఐశ్వర్య రాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే నాగార్జున ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని.. వీడియోలున్న14 వెబ్ సైట్స్ లింక్స్ ను తొలగించాలని లాయర్ పేర్కొన్నారు.
