టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేనే అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్‌బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ప్రియురాలు జైనబ్ ను పెళ్లాడి ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇరుకుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇండస్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి- సురేఖ, రామ్‌చరణ్- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. అక్కినేని అఖిల్ దంపతులకు ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Akhil Akkineni: వివాహబంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. ఫొటోలు వైరల్
- వివాహబంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్
- ప్రియురాలు జైనబ్ ను పెళ్లాడి ఏడడుగులు వేశారు

Akhil