NTV Telugu Site icon

Akhilesh Yadav: అఖిలేష్ ఆస్తులెన్నో తెలుసా! భార్యకు ఎంత అప్పు ఇచ్చారంటే..!

Dke

Dke

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్‌ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవలే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఆయన భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పూరి నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. అఖిలేష్.. తన భార్యకు కూడా అప్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Krunal Pandya: మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్.. పోస్ట్ వైరల్..

అఖిలేష్ రూ.26.34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఆయన సతీమణి డింపుల్ యాదవ్   ఆస్తుల మొత్తం రూ.15 కోట్లుగా ఉంది. మొత్తంగా వారిద్దరి సంపద విలువ రూ.41 కోట్లని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అఖిలేశ్‌.. చరాస్తులు రూ.9.12 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.17.22 కోట్లుగా ఉన్నాయి. రూ.25.61 లక్షలు నగదు రూపంలో ఉందని, రూ.5.41 కోట్లు బ్యాంక్‌లో ఉందని పేర్కొన్నారు. ఇక ఐదు సంవత్సరాల వార్షిక సగటు ఆదాయం రూ.87 లక్షలు కాగా.. డింపుల్‌ ఆదాయం రూ.65 లక్షలుగా ఉంది. ఇక అఖిలేష్.. తన భార్యకు రూ.54 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: రెండో దశ ఎన్నికల ముగిసిన వేళ మోడీ కీలక వ్యాఖ్యలు..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికి రెండు విడతల పోలింగ్ ముగిశాయి. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. మెయిన్‌పురి, కన్నౌజ్ స్థానాలకు మూడు, నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీ సీట్లు పంచుకుని బరిలోకి దిగాయి.

ఇది కూడా చదవండి: Lok Sabha Elections: కాషాయ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు

Show comments