Akhil – Agent : అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే అఖిల్ చివరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ” ఏజెంట్ ” బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాపోతే ఇప్పుడు ఈ సినిమా మరొక కారణంతో అందరి దృష్టిలో పడింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా సోనీ LIV లో OTT విడుదల కోసం మరింత జాప్యాన్ని ఎదుర్కొంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోయిన సినీ ప్రేమికులు, సినిమా చూడనివారు కోసం OTT రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
Pawan Kalyan: మీరు సీఎం..సీఎం అంటే నాకు భయమేస్తోంది..
ఇకపోతే, ఈ సినిమా OTT కంటే ముందుగా టీవీ ప్రీమియర్ షోకి రెడీ అయిపోయింది. ఏజెంట్ సినిమా హిందీ వెర్షన్ త్వరలో గోల్డ్ మైన్ టీవీ ఛానెల్లో ప్రీమియర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఎప్పుడన్న ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇక OTT ప్రేక్షకులు మాత్రం సోనీ LIVలో దాని డిజిటల్ ప్రీమియర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై కూడా అతి త్వరలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియాలు కీలక పాత్రల్లో నటించారు.
Monsoon: అలర్ట్.. రేపటి నుంచి ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు..