NTV Telugu Site icon

బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన ‘అఖండ’ నిర్మాత

హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
బాలయ్య, అల్లు అర్జున్ రావడంతో ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చాలా మంది అభిమానుల వద్ద పాసులు లేకపోవడంతో పోలీసులు శిల్పాకళావేదికలోకి వెళ్లనివ్వకుండా నిలిపివేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు.

ఈ నేపథ్యంలో నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి నందమూరి అభిమానులకు సారీ చెప్పాడు. తొలుత ఈ ఈవెంట్‌ను బయట ఓపెన్ ప్లేస్‌లో నిర్వహించాలని భావించామని, కానీ వర్షం పడే అవకాశం, ఇతర కారణాల వల్ల శిల్పకళావేదికలో నిర్వహించామని… దీనివల్ల ఎక్కువ మంది అభిమానులు వచ్చే అవకాశం లభించలేదని నిర్మాత తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ కొంచెం డల్ అయ్యిందని.. కానీ మునుపటి మేనియాను అఖండతో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అఖండ, పుష్ప సినిమాలు మళ్లీ తెలుగు పరిశ్రమకు పాత రోజులు తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే నార్త్‌లో ఇంకా కరోనా భయం ఉన్నట్లు కనిపిస్తోందని.. ఆ భయాన్ని పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ బ్రేక్ చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మూవీ ఫంక్షన్‌కు అడగ్గానే వచ్చినందుకు బన్నీకి నిర్మాత రవీందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా గురించి తనకు ఎలాంటి డౌట్ లేదని.. డిసెంబర్ 2న విడుదలయ్యే ఈ మూవీ కచ్చితంగా బాలయ్య అభిమానులను అలరిస్తుందని పేర్కొన్నారు.

Miryala Ravinder Reddy Speech At Akhanda Pre Release Event | Balakrishna | Boyapati Srinu | NTV ENT