Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ ఖరారైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అఖండ 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి దీనిని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను కథను మరింత కొత్తగా తెరకెక్కించారని సమాచారం.
IND vs WI: ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్!
ఇక దసరా పండుగను పునస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్ లో విడుదల తేదీ, అలాగే పోస్టర్‌లో బాలకృష్ణ పొడవాటి జుట్టు, గడ్డంతో, మెడలో రుద్రాక్షలు ధరించి గంబిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలాగే చేతిలో భారీ త్రిశూలం పట్టుకుని, కాషాయ రంగు వస్త్రాలు ధరించి ఉన్నారు. అతని వెనుక ఉన్న మంచు, పోస్టర్ లోని డైనమిక్ పోజ్ బాలకృష్ణ పాత్ర ఎలా ఉండబోతుందో అని అంచనాలను పెంచుతున్నాయి. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ అంటే చాలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హై-వోల్టేజ్ తో మరింత పవర్‌ఫుల్ గా మారుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Planes Collide: తృటిలో పెను ప్రమాదం మిస్.. ఢీకొన్న రెండు విమానాలు
