NTV Telugu Site icon

Akhanda 2 : ఆ రోజున ‘అఖండ 2’ స్పెషల్ అనౌన్స్మెంట్..?

Akhanda 2

Akhanda 2

Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను  సితార  ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశి గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా “NBK109 “అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.బాలయ్య మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Read Also :Kannappa : కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇదిలా ఉంటే జూన్ 10 బాలయ్య బర్త్ డే.. ఈ సందర్భంగా ఈ చిత్రం నుండి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలిపారు.అయితే బాలయ్య బర్త్ డే రోజు మరో భారీ చిత్రం అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.బాలయ్య,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం “అఖండ” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడు బాలయ్య బర్త్ డే సందర్భంగా “అఖండ 2 ” సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఈపాటికే పూర్తి అయింది.దీనితో ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Show comments