Site icon NTV Telugu

Akhanda2 : ప్రేక్షకులకు అఖండ 2 ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అభ్యర్థన..

Akhanda 2 (2)

Akhanda 2 (2)

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో  తెరకెక్కిన అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సమస్యలు అధిగమించి ఈనెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. 11తేదీన రాత్రి 9 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.మరికొద్ది సేపట్లో అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. రిలీజ్ వాయిదా పడడంతో సినిమాపై హైప్ ఇంకా పెరింగిందనే చెప్పాలి.

Also Read : Akhanda2Thandavam : అఖండ 2 టికెట్స్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వ జీవో వచ్చేసింది

ఇదిలాఉండగా అఖండ 2 ఓవర్సీస్ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. డిసెంబరు 5 రిలీజ్ కోసం కేటాయించిన థియేటర్స్ ను ఇతర హాలీవుడ్ సినిమాలకు కేటాయించేశారు. ఇప్పుడు 12తేదీన రిలీజ్ కోసం చాలా తక్కువ స్క్రీన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితిపై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అయినా మోక్ష మూవీస్ ఆడియెన్స్ కు ఓ విన్నపం చేసింది. అఖండ2 అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటి. ప్రేక్షకులకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరికతో ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం. కానీ పరిస్థితులు ఒక్కోసారి మన చేతుల్లో ఉండవు.  కాబట్టి ప్రతి ఒక్కరికీ ఇది మా ప్రత్యేక అభ్యర్థన. ఈ చివరి గంటలో మరియు ఇంత తక్కువ సమయంలో థియేటర్‌ను పొందడం మాకు ఒక ఛాలెంజ్. అందులో మేము కొంతవరకు విజయం సాధించాము. మీ షెడ్యూల్‌లకు  అనుగుణంగా  షోస్ ప్లాన్స్ చేసేందుకు మీ మద్దతును కోరుతున్నాము. థియేటర్లు ఖచ్చితమైన ప్రదర్శన సమయాలను ఒక్కొక్కటిగా ఫిక్స్ చేస్తున్నాము. ఈ రాత్రి లేదా రేపు వాటి లిస్ట్ ను ప్రకటింస్తాం కాస్త గమనించండి. అఖండ2 గ్రాండ్ USA డిసెంబర్ 11న ప్రీమియర్‌లు ప్రదర్శిస్తాం. ప్రస్తుతానికి థియేటర్ల నుండి అప్రూవల్ కోసం మేము మా వంతు కృషి చేస్తున్నాము. దయచేసి ఈ సమయంలో మీ మద్దతు మాకు ఎంతో అవసరం’ అని ట్వీట్ చేశారు.

 

Exit mobile version