Site icon NTV Telugu

Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ..!

Akhanda 2

Akhanda 2

Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ2 ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము.. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2 ఎప్పడు వచ్చినా గురి చూసి కొడుతుంది.. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం..” అంటూ 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

READ MORE: Air India Flight: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్.. ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది

కాగా.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ తాండవం’ కోసం తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమా… నాల్గో తేదీ ప్రీమియర్స్‌తో ప్రారంభమై, ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, అభిమానుల అంచనాలను నిరాశపరుస్తూ, చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ‘అఖండ తాండవం’ సినిమాను 14 రిల్స్ ప్లస్ (రామ్ ఆచంట, గోపి ఆచంట) సంస్థ నిర్మించింది. ఈ సంస్థకు, హీరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మధ్య ఉన్న ఫైనాన్షియల్ అగ్రిమెంట్ల కారణంగా, సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.

Exit mobile version