నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య ఆస్థాన విద్వాంసుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందుగా అనగా 4వ తేదీన రాత్రి 9.30 గంటల ఆటతో ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్స్ ఫుల్ ఆల్బమ్ ను రిలీజ్ చేశారు. ఏమాటకామాట తమన్ విశ్వరూపం చూపించాడు. ప్రతి పాటను శివతత్వంతో హోరెత్తించ్చాడు తమన్. తమన్ నుండి ఇటీవల వచ్చిన బెస్ట్ ఆల్బమ్ అఖండ 2 అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సర్వేపల్లి సిస్టర్స్ గాత్రం చేసిన హైందవం సాంగ్ కు తమన్ మ్యూజిక్ అద్భుతమనే చెప్పాలి. అలాగే సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడని ఇన్ సైడ్ టాక్. ఇటీవల తమన్ పై నెగిటివిటి కాస్త పెరిగిన మాట వాస్తవం. సంక్రాంతికి రాబోతున్న ఓ పాన్ ఇండియా సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ పట్ల విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో తమన్ ని ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేశారు. తమన్ కూడా అంతే స్థాయిలో ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉండగా బాలయ్య నటించిన సినిమాకు తమన్ విశ్వరూపం చూపిస్తాడని అందుకు నిదర్శనం ఈ ఏడాది స్టార్టింగ్ లో వచ్చిన డాకు మహారాజ్ ఇప్పుడు రాబోతున్న అఖండ 2. ఇందుకే తమన్ ని నందమూరి తమన్ అనేదని కామెంట్స్ చేస్తున్నారు.
