టీమిండియా జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫినిషర్ కాదని, దానిని టీమ్ మేనేజ్మెంట్ అంగీకరించడం లేదని భారత మాజీ బ్యాటర్, ప్రఖ్యాత వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా బుధవారం తెలిపారు. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఆందోళనల గురించి మాట్లాడుతూ, ఆకాష్ చోప్రా రవీంద్ర జడేజాను ఫినిషర్ పాత్రకు పరిగణించాలనే ఆలోచనను ఆలోచింప చేసేలా చేసాడు.
Andhara Pradesh: ఏపీ శాసనసభ రద్దు..
టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జూన్ 6, బుధవారం ఐర్లాండ్‌తో జరిగే T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ ముందు ఇలా కీలక వ్యాఖ్యలు చేసాడు. న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు భారత క్రికెట్ జట్టు ఆందోళనల గురించి మాట్లాడుతూ., ఆకాష్ చోప్రా రవీంద్ర జడేజాను ఫినిషర్ పాత్రకు పరిగణించాలనే ఆలోచనను విస్మరించాడు. ఇక జియో సినిమా కార్యక్రంలో భాగంగా.. రవీంద్ర జడేజా మంచి ఫినిషర్ కాదు. కానీ అతని అవసరం గ్రహించమని ఆయన పేర్కొన్నాడు. కానీ., అతను మంచి ఫామ్ లో లేడని.., అతను మంచి ఫినిషర్ కాదని., ఆ సమస్య అనే వాస్తవాన్ని కూడా మేము అంగీకరించలేదని ఆకాష్ చోప్రా అన్నారు.
Apple Foldable Mobile: అతి త్వరలో రాబోతున్న ఫోల్డబుల్ ఐఫోన్.. వివరాలు ఇలా..
ఇక శివమ్ దూబే బ్యాటింగ్ ఫామ్‌పై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోసం కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌ల నేపథ్యంలో హార్డ్ హిటింగ్ బ్యాటర్ జట్టులో ఎంపికయ్యాడు. అయితే, జట్టులో ఎంపికైన వెంటనే అతని ప్రదర్శన తగ్గింది. జూన్ 1న న్యూయార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన భారతదేశం యొక్క ఏకైక వార్మప్ గేమ్‌లో అతను 16 బంతుల్లో 14 పరుగులకే అవుట్ అయ్యాడు. టీ 20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఫీల్డింగ్ కూడా సమస్యాత్మకంగా ఉంటుందని చోప్రా అంచనా వేస్తున్నాడు.