Site icon NTV Telugu

AJITH KUMAR : డైరెక్టర్స్‌ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్

Ajith Kumar

Ajith Kumar

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు కార్ రేస్ మాత్రమే హాబీ కాదు.. దర్శకులను రిపీట్ చేయడం కూడా ఓ అలవాటుగా చేసుకున్నాడు. శరణ్, శివ, హెచ్ వినోద్‌లను ఇప్పటికే తన ఆస్థాన దర్శకులుగా మార్చేసిన అజిత్.. నెక్ట్స్ ఈ జాబితాలోకి అధిక్ రవిచంద్రన్‌ను కూడా చేర్చాడు. గుడ్ బ్యాడ్ అగ్లీతో ఓకే అనిపించుకున్న అధిక్ కే ఏకే 64 డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని అధిక్ చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అప్డేట్ లేదు
Also Read : Narendra Modi : విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ సందేశం.. ‘సప్తపది’ విశిష్టతను గుర్తుచేస్తూ అభినందనలు

ఏకే 64ని టాలీవుడ్ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్… ఆ తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్నాయని బజ్ ఏర్పడింది. కానీ 150 కోట్లకు పైగా అజిత్ రెమ్యునరేషన్ అడగడటంతో ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యిందని సమాచారం. కెరీర్‌పై కన్నా రేసింగ్‌పై ఎక్కువ కాన్సట్రేషన్ చేయడంతో ప్రాజెక్ట్ ఓ పట్టాన పట్టాలెక్కట్లేదు.. ఏకే64 నుండి క్లారిటీ లేకపోయినప్పటికీ మరో ప్రాజెక్ట్ గురించి ఇంట్రస్టింగ్ బజ్ ఏర్పడింది. తన ఆస్థాన దరర్శకుడు.. కంగువాతో సూర్యకు ఖంగుతినిపించిన శివకు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. శివను స్టార్ డైరెక్టర్‌గా మార్చింది అజితే. శివతో కంటిన్యూగా ఫోర్ మూవీస్ చేశాడు అజిత్. వీరమ్, వేదాళం, వివేకం, విశ్వాసం లాంటి వీ సెంటంటెమెట్ వర్కౌట్ చేసి కోలీవుడ్ స్టార్ హీరోకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు శివ. అలా అజిత్ కు ఆస్థాన దర్శకుడిగా మారిపోయాడు. తన కెరీర్‌లో బెస్ట్ పిక్చర్స్ ఇచ్చినందుకు మళ్లీ అతడికే ఛాన్స్ ఇస్తున్నాడు అజిత్. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోందని అంటున్నాడు శివ.

Exit mobile version