Indian squad for WTC final: వెటరన్ బ్యాటర్ అజింక్య రహానె జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 25) ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియా ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించిన సెలెక్టర్లు ఒక్క అనూహ్య మార్పు చేశారు. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఎంపిక చేశారు. కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు మరో అవకాశం ఇచ్చారు. అయితే, మణికట్టు-స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటులభించలేదు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను ఆల్-రౌండర్‌లుగా ఎంపిక చేశారు.
Read Also: Wrestlers Allegations: రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవి.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్