NTV Telugu Site icon

IPL 2025: టీం కొత్త కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ పేర్లను ప్రకటించిన కేకేఆర్‌

Kkr

Kkr

IPL 2025: భారత క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఈ నెల 22 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఎప్పటిలానే ఈసారి కూడా 10 జట్లు తమ బలాబలాలను పరీక్షించుకోనున్నాయి. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో రసవత్తర పోటీలు జరుగనున్నాయి. అభిమానులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించే ఈ క్రికెట్‌ పండుగలో జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ మే 25న జరగనుంది.

Read Also: Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..

ఇకపోతే, కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌) ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందే తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. భారత జట్టు సీనియర్‌ ఆటగాడు అజింక్యా రహానేకి సారథ్య బాధ్యతలను అప్పగించినట్లు కేకేఆర్‌ తెలిపింది. వెంకటేశ్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా (ఎక్స్‌) ద్వారా వెల్లడించింది. అజింక్యా రహానే కెప్టెన్ అవుతారని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. రహానేకి ఇది చక్కటి అవకాశమని, తన అనుభవంతో జట్టును విజయపథంలో నడిపించగలడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను ఈసారి కేకేఆర్‌ రిటైన్‌ చేసుకోలేదు. అంతేగాక, మెగా వేలంలో కూడా కేకేఆర్‌ అతడిని తీసుకోలేదు కూడా. ఇక కేకేఆర్‌ నేడు తన కొత్త జెర్సీని కూడా లాంచ్ చేసింది. కొత్త జెర్సీపై మూడు స్టార్లు కనిపిస్తున్నాయి. 2012, 2014, 2024 సంవత్సరాల్లో కేకేఆర్‌ మూడు టైటిళ్లను దక్కించుకున్నందుకు గౌరవార్థం ఈ మూడు స్టార్లు జెర్సీపై ఉంచినట్లు ఫ్రాంఛైజీ తెలిపింది. మిథున రాశిలోనే మూడు టైటిళ్లు గెలిచామని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్‌ 2025 తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఈ నెల 22న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో తలపడనుంది. దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఎంపికైనప్పటికీ, ఢిల్లీ జట్టు మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నాయి. మిగిలిన జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ప్రస్తుతం భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమిస్ కు చేరిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో మంగళవారం టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఐపీఎల్‌ 2025లో పాల్గొనబోయే అనేక మంది భారతీయ ఆటగాళ్లు ఇప్పటికే ఈ టోర్నీలో వారి ప్రతిభను చూపిస్తున్నారు.