తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం తలైవా వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు. వీటిలో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 09 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఐశ్వర్య రజినీకాంత్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు.. రిపబ్లిక్ డే కానుక గా ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ఐశ్వర్య మాట్లాడుతూ.. రజినీకాంత్ పై వస్తున్న వరుస ట్రోల్స్ పై స్పందించారు..
సోషల్ మీడియాలో మా నాన్న ‘సంఘీ’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటా.. ఆన్‌లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ ఎప్పుడు చెబుతూ ఉంటుంది… అలాగే నాన్నగారిపై వస్తున్న నెగటివిటీ గురించి కూడా నా టీమ్ ద్వారా నేను తెలుసుకున్నాను. మేము కూడా మనుషులమే. మాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ'(హిందుత్వ ఐడియాలజీని ఫాలో అయ్యేవారు) అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ‘సంఘీ’ అంటే మొదట్లో నాకు కూడా అర్ధం తెలిదు. కానీ తర్వాత దానికి అర్థం తెలుసుకున్నా. ఒక రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చేవారిని ‘సంఘీ’ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. రజనీకాంత్ సంఘీ కాదు. నాన్న అలాంటి వారే అయితే లాల్ సలామ్ చిత్రంలో మొయినుద్దీన్ భాయ్ పాత్ర లో నటించే వారే కాదు. దయచేసి ఇలాంటివి ఆపండి అంటూ ఐశ్వర్య రజనీకాంత్ చెప్పుకొచ్చారు.. అయితే ఐశ్వర్య మాటలు విన్న రజనీకాంత్ అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నారు.