Site icon NTV Telugu

Aishwarya Rajesh : ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిన ఐశ్వర్య రాజేష్..

Whatsapp Image 2023 06 23 At 4.16.11 Pm

Whatsapp Image 2023 06 23 At 4.16.11 Pm

ఐశ్వర్యా రాజేష్‌ తాజాగా హోమ్లీ బ్యూటీగా మారింది.కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో ఈ భామ అందరిని మెప్పిస్తుంది.గ్లామర్‌ పాత్రలకి దూరంగా ఉండే ఈ భామ ట్రెడిషనల్‌ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది.రీసెంట్ గా ట్రెడిషనల్‌ లుక్‌లో కనువిందు చేసింది. ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన ఈ భామ మేకప్‌ లేకుండా వున్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.ఈ సందర్భంగా `ఆనందకరమైన సమయం` అంటూ  కామెంట్ కూడా చేసింది.. మేకప్‌ లేకుండా కూడా ఎంతో క్యూట్ గా ఉంది ఐశ్వర్యా రాజేష్‌. జనరల్‌గా డస్కీ అందంతో ఎంతో హాట్‌గా కనిపిస్తుంది ఐశ్వర్యా. సినిమాల్లో చాలా వరకు పద్దతిగానే కనిపిస్తుంది. గ్లామర్‌ పాత్రలకు కాస్త దూరంగా ఉంటుంది. కధా ప్రాధాన్యం చిత్రాలు ఎంచుకుని తన నటనతో అందరిని మెప్పిస్తుంది.కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

తన నటనతో అందరి చేత ప్రశంసలు పొందిన ఈ భామ టాలీవుడ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ ఆమె హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది.. ఆమె నటించిన సినిమాలన్నీ కూడా అంతగా మెప్పించలేకపోయాయి.. దీంతో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ కోలీవుడ్‌ సినిమాలకే పరిమితమయ్యింది. తెలుగులో ఆమెకు పెద్ద హీరోల సినిమాలలో అవకాశం రావడం లేదని, తనకి తెలుగులో ఒక మంచి సినిమాలో నటించాలని ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది.ఆమె లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలే వరుసగా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకి హీరోలని ఆ ప్రశ్న అడగ్గలరా అంటూ సెటైర్లు కూడా పేల్చింది. మరోవైపు `పుష్ప` సినిమాలో రష్మిక మందన్నా నటించిన `శ్రీవల్లి` పాత్రలో తనకి బాగా సూట్‌ అవుతుందని రష్మిక కంటే తనకే బాగా సెట్‌ అవుతుందంటూ కామెంట్‌ కూడా చేసింది. దీంతో నెటిజన్లు ఈ భామను భారీగానే ట్రోల్ చేసారు..

Exit mobile version