Site icon NTV Telugu

Aishwarya Rai Cannes Look: కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫొటోస్ వైరల్!

Aishwarya Rai Cannes 2024

Aishwarya Rai Cannes 2024

Aishwarya Rai Look Gorgeous on red carpet at Cannes 2024: ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. మే 14న కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆరంభం కాగా.. ఫ్యాషన్ ప్రియులు, అభిమానులు మాత్రం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్య బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్‌లో ఉన్న గౌనులో రెడ్ కార్పెట్‌పై నడిచారు. చేతికి గాయం ఉన్నా.. దాన్ని కనబడనీయకుండా తన డ్రెస్ ఫ్యాషన్‌తో కవర్ చేశారు.

2024 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్‌ డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తన దుస్తులతో ప్రేక్షకులను మెస్మరైజ్చేయడంలో ఐష్ మరోసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్‌ను ప్రపంచ సుందరి ధరించారు. ఐష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రెడ్ కార్పెట్‌పై నడవడం ఇది 21వ సారి.

Also Red: Pooja Hegde: సూర్య 44లో పూజా హెగ్డే.. అండమాన్‌లో షూటింగ్‌!

77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు తాజాగా ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఫ్రెంచ్ రివేరా చేరుకున్నారు. ఐశ్వర్యకు గాయం అవ్వడంతో ఆరాధ్య తన తల్లికి సహాయం చేస్తున్నారు. అందుకు సంభవించిన వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఐష్ చేతిక తీవ్రమైన గాయమే అయింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గత 20 ఏళ్ల నుంచి పాల్గొంటున్న నేపథ్యంలో ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టారు. దీంతో ఐశ్వర్య డెడికేషన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

Exit mobile version