NTV Telugu Site icon

Aishwarya Arjun: అర్జున్ ఇంట పెళ్లి భాజాలు.. పెళ్లి అప్పుడే?

aiswarya

aiswarya

టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు..కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఆయన వారసురాళ్లుగా ఆయన కూతురు ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ అవ్వలేక పోయారు.. కూతుర్లంటే ఎంతో ఇష్టం ఉన్న అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రేమను అంగీకరించాడు. ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది.. ఇప్పుడు పెళ్లి భాజాలు మోగబోతున్నాయి..

నటుడు ఉమాపతితో ప్రేమలో పడింది.. గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ ని తనకు చాలా ఇష్టమైన హనుమాన్ ఆలయంలో గ్రాండ్ గా చేశారు. ఇక ఆ తర్వాత పెళ్లి గురించి మాత్రం ఏ ఒక్క సమాచారాన్ని తెలుపలేదు.. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ ఇప్పుడు తాజాగా పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది..

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూన్ 10వ తేదీన చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహాన్ని కూడా ఎంగేజ్మెంట్ చేసిన హనుమాన్ ఆలయంలోనే పెళ్లి జరగబోతుందని సమాచారం.. త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతున్నారట.. ఐశ్వర్య కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. దీంతో సినిమాలకు దూరమైంది.. ఇప్పుడు స్టడీస్ పై ఫోకస్ పెట్టింది. ఇక అర్జున్ సినిమాల విషయానికొస్తే.. విజయ్ దళపతి నటించిన లియో సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించారు.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు..

Show comments