Airtel: వినియోగదారులకు తక్కువ ధర, దీర్ఘకాలిక వాలిడిటీకి రీఛార్జ్ ప్లాన్ లభిస్తే సంతోషానికి అవధులుండవు. ప్రతి వినియోగదారుడు అదే విధమైన ప్లాన్‌ను కోరుకుంటారు. దీనిలో వినియోగదారుడు దీర్ఘకాలం చెల్లుబాటుతో పాటు అపరిమిత డేటా ప్రయోజనాన్ని పొందుతాడు. మీరు అలాంటి రీఛార్జ్ ప్లాన్ కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే ఇది ట్రై చేయండి.. గుర్తుంచుకోండి ఇది ఎయిర్ టెల్ వినియోగదారులకు మాత్రమే.
ఎయిర్‌టెల్ రూ. 799 ప్లాన్
రూ.799తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లైతే మీకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మీరు ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు. ఇవి కాకుండా మీరు ప్రతిరోజూ 100 SMSలను కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లో కంపెనీ మీకు రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ లో అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఉచిత హెలోట్యూన్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.
Read Also:TS Govt: మైనార్టీలకు రూ.లక్ష సాయం.. ఆగస్టు 14 వరకు ధరఖాస్తుల స్వీకరణ
ఎయిర్‌టెల్ రూ. 519 ప్లాన్
టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల సౌకర్యార్థం రూ.519 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 1.5 GB హై స్పీడ్ డేటా ప్రయోజనం పొందుతారు. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 60 రోజులు మాత్రమే. మీకు తక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కావాలంటే, మీరు ఈ ప్లాన్‌ని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
JIO రూ 719 ప్లాన్
మీరు జియో వినియోగదారు అయితే మీరు రూ.719తో జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ని పొందుతున్నారు. ఈ ప్లాన్‌లో మీరు ఎయిర్‌టెల్ కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారు. దాని వాలిడిటీ 84 రోజుల పాటు లభిస్తుంది. రోజువారీ 2 GB హై స్పీడ్ డేటా, 100 SMS, ప్రయోజనం పొందండి. ఈ ప్లాన్‌లోని రోజువారీ డేటా ప్రకారం.. మీరు 84 రోజుల పాటు మొత్తం 168 GB డేటాను పొందుతారు.
Read Also:World Tigers Day: నేడు ప్రపంచ పులుల దినోత్సవం.. పూరీ తీరంలో 15 అడుగుల సైకత చిత్రం
