NTV Telugu Site icon

Airtel: దేశవ్యాప్తంగా 2000 నగరాల్లో IPTV సేవలు తీసుకరానున్న ఎయిర్‌టెల్.. ప్లాన్స్ లిస్ట్ ఇదే!

Airtel

Airtel

Airtel: దేశంలోని 2000 నగరాల్లో భారతీ ఎయిర్‌టెల్ తమ IPTV (Internet Protocol Television) సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఎయిర్‌టెల్ తన IPTV సేవను కొత్త, ప్రస్తుత వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది. ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద స్క్రీన్ పై మంచి క్వాలిటీ అనుభూతిని అందించేందుకు ఈ సేవలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. అతి త్వరలో ఢిల్లీ, రాజస్థాన్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

Read Also: David Warner : రాబిన్ హుడ్.. నిముషానికి వార్నర్ అన్ని కోట్లు తీసుకున్నాడా..?

ఈ IPTV సేవల ద్వారా వైఫై సదుపాయంతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్‌, ఆపిల్ టీవీ+, సోనీలివ్‌, జీ5 లతోపాటు 600 టెలివిజన్‌ ఛానెళ్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇక ఇందుకు సంబంధించి ప్లాన్స్ వివరాలను కూడా తెలిపింది. ఈ ప్లాన్స్ రూ.699 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఇందుకోసం ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా కూడా కనెక్షన్‌ బుక్‌ చేసుకోవచ్చు. వీరికి కూడా ప్రారంభ ఆఫర్‌ కింద 30 రోజుల పాటు ఉచిత సేవలు అందనున్నాయి.

Read Also: PM Modi: రామేశ్వరంలో మోడీ శ్రీరామనవమి వేడుకలు.. అదే రోజు ‘‘పంబన్’’ వంతెన ప్రారంభం..

ఎయిర్‌టెల్ IPTV సేవను వినియోగదారులు వివిధ అవసరాలకు అనుగుణంగా ఎన్నుకోవడానికి 5 ప్లాన్స్ ను అందుబాటులో ఉంచింది. ఇందులోని రూ.699 ప్లాన్ లో వినియోగదారులకు 40 Mbps వేగంతో కూడిన Wi-Fi కనెక్షన్, 26 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెల్స్ లభిస్తాయి. ఎక్కువ వేగం కోరుకునేవారికి రూ. 899 ప్లాన్ లో 100 Mbps స్పీడ్‌తో అదే స్ట్రీమింగ్ యాప్స్, టీవీ ఛానెల్స్ అందించబడతాయి. అలాగే, రూ.1099 ప్లాన్ లో Wi-Fi వేగం 200 Mbps కు పెరగడంతో పాటు Apple TV+, Amazon Prime వంటి యాప్స్ తో కలిపి 28 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెల్స్ అందించబడతాయి. మరింత ప్రీమియం అనుభవాన్ని కోరుకునే వినియోగదారుల కోసం రూ.1599 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 300 Mbps స్పీడ్, నెట్‌ ఫ్లిక్స్‌, ఆపిల్ టీవీ+, అమెజాన్ ప్రైమ్ తో కలిపి 29 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెల్స్ లభిస్తాయి. అలాగే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ కోరుకునే వినియోగదారుల కోసం రూ. 3999 ప్లాన్ కూడా ఉంది. ఇది 1 Gbps స్పీడ్ తో పాటు నెట్‌ ఫ్లిక్స్‌, ఆపిల్ టీవీ+, అమెజాన్ ప్రైమ్ సహా 29 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెల్స్ ను అందిస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు తగిన విధంగా ఈ ప్లాన్‌లను ఎంపిక చేసుకొని అత్యుత్తమ IPTV అనుభవాన్ని పొందవచ్చు.