Air Pollution: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి!
- వాయు కాలుష్యానికి ఐదేళ్లలోపు సుమారు 7 లక్షల మంది చిన్నారులు బలి..
- 90 శాతానికి పైగా మరణాలకు ప్రధాన కారణం పీఎమ్ 2.5 సూక్ష్మ ధూళికణాలు..
- హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution: వాయుకాలుష్యం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. 2021లో వాయుకాలుష్యం దెబ్బకు 81 లక్షల మంది మరణించినట్లు ఈ అధ్యయనం తేల్చింది. అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తరువాత స్థానంలో వాయు కాలుష్యం నిలిచింది. పొగాకు, పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయు కాలుష్యమే ప్రజలను బలితీసుకుంటోందని ఈ రిపోర్టులో వెల్లడైంది. వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధికంగా ఉన్నట్టు తేలింది. యూనీసెఫ్‌తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఈ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఐదేళ్ల లోపు సుమారు 7 లక్షల మంది చిన్నారులు ఈ వాయు కాలుష్యానికి బలైనట్టు తెలిపింది.
Also Read
ఇక, ఇందులో 5 లక్షల మరణాలు ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ లాంటి వాటిని వంటచెరకుగా వాడటమేనని ఈ నివేదికలో తేలింది. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90 శాతానిపైగా పీఎమ్ 2.5 అనే సూక్ష్మ ధూళి కణాలే కారణం అని తేల్చింది. పీఎమ్ 2.5 సూక్ష్మధూళి కణాల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ చెప్పుకొచ్చింది. అయితే, వాస్తవ పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొనింది. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాలుష్యం 2021లో 5 లక్షల పైచిలుకు చిన్నారులను బలితీసుకుంది. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని శాస్త్రవేత్తలు ఈ నివేదికలో తేల్చారు. ముఖ్యంగా ఇళ్లల్లో వంటకు బొగ్గు, చెక్కలాంటి ఇంధనాల వినియోగం తగ్గించాలని చెప్పింది. ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది అని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.
Read Also: Russia-North Korea: రష్యా- నార్త్ కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం..
కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్‌లు లేదా మంటలపై ఆహారం వండుతూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే, మరింత మెరుగైన స్టవ్‌లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గిపోయాయని వెల్లడించింది. దాదాపు 200 దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఈ నివేదికను తయారు చేసింది. కాగా, ఈ ప్రమాదకర వంట విధానాల నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు 2.2 బిలియన్ డాలర్లు కేటాయించినట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?