Site icon NTV Telugu

Planes Collide: గగనతలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు విమానాలు ఢీకొనబోయి..

Airlines

Airlines

Planes Collide: గగనతలంలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఎయిరిండియా, నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన విమానాలు గాల్లో దాదాపు ఢీకొట్టుకున్నంత పని అయింది. శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-320 విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండుకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీకొట్టుకున్నంత పనిచేశాయి. వెంటనే హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఎయిరిండియా విమానం 19,000 అడుగుల నుంచి కిందికి దిగుతుండగా, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందనినేపాల్ పౌర విమానయాన అథారిటీ (CAAN) నిరౌలా చెప్పారు.

Read Also: Egypt Temple: ఈజిప్ట్‌ ఆలయంలో వింత.. 2వేలకు పైగా గొర్రెతలలు లభ్యం

రెండు విమానాలు సమీపంలో ఉన్నాయని రాడార్‌లో చూపిన తర్వాత, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం 7,000 అడుగులకు దిగిందని అధికార ప్రతినిధి తెలిపారు.దీనిపై దర్యాప్తు చేసేందుకు పౌర విమానయాన అథారిటీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు కంట్రోల్‌ రూంకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ముగ్గురు అధికారులను నేపాల్ పౌర విమానయాన అథారిటీ (CAAN) సస్పెండ్ చేసింది.దీనిపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి తక్షణ వ్యాఖ్య లేదు. ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా స్పందించాల్సి ఉంది.

 

Exit mobile version