Bandi Sanjay : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న అతిభారీ వర్షాలతో రెండు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద మానేరు వాగులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. దాంతో పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి 30 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ చూపించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వైమానిక దళ హెలికాప్టర్లు పంపించాలని కోరారు.
Read Also : Medak- Kamareddy : మెదక్, కామారెడ్డిలో స్కూల్స్ కు రేపు సెలవు
స్పందించిన రాజ్ నాథ్ వెంటనే హకీంపేటలోని వైమానికదళ హెలికాప్టర్ పంపాలని డిఫెన్స్ అధికారులను ఆదేశించారు. దీంతో వైమానిక దళ హెలికాప్టర్లు రంగంలోకి దిగబోతున్నాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొంటాయని సంజయ్ కుమార్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Read Also : Pocharam Project : ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. తెగే ప్రమాదం..
