NTV Telugu Site icon

Air Canada: గాల్లో ఉండగానే మంటలు.. విమానానికి తప్పిన పెను ముప్పు..

Fire

Fire

ఎయిర్ కెనడా విమానంకు ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగాయి. అయితే పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే..

NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..?

ఎయిర్ కెనడా బోయింగ్ AC 872 కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అవుతుండగా కుడి ఇంజన్‌లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి. పేలుడు సంభవించినప్పుడు, విమానం రెక్కల దగ్గర మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత పైలట్లు విమానాన్ని పియర్సన్ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. దింతో విమానం తీవ్ర ప్రమాదం నుంచి బయటపడింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

INDIA vs Pakistan: 2007 టీ20 వరల్డ్​కప్ నుంచి దాయాదుల పోరులు ఎలా ఉన్నాయంటే..

ప్యారిస్ వెళ్తుండగా విమానంలో మంటలు చెలరేగాయి. విమానం రన్‌వే నుంచి వెళ్లిపోయిన ముప్పై నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ 8:46 గంటలకు దాని స్థానం నుండి బయలుదేరింది. ఇక తిరిగి రాత్రి 9:50 గంటలకు టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.