ఏఐ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. హ్యూమనాయిడ్ రోబో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. చైనీస్ కంపెనీ AiMOGA రోబోటిక్స్‌కు చెందిన మోర్నిన్ అనే రోబోట్ ఎటువంటి మానవ సహాయం లేకుండా కారు డోర్ తెరిచింది. మొదటిసారి ఈ పని చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. మానవులు కారు డోర్ ను చాలా సులభంగా తెరవగలుగుతరు. కానీ హ్యూమనాయిడ్ రోబోకు దీన్ని చేయడం చాలా కష్టమైన పని. కానీ, ఇప్పుడు ఈ రోబో కార్ డోర్ తెరిచి వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది.
Also Read:Allu Aravind : సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా ఎవరికి తెలియదు
AiMOGA రోబోటిక్స్ అభివృద్ధి చేసిన మోర్నిన్ రోబోట్ చైనాలోని చెరీ డీలర్‌షిప్‌లో కారు డోర్ తెరవడాన్ని ప్రదర్శించింది. ఈ రోబోట్ ఈ పనిని చేస్తున్నప్పుడు దాని సెన్స్, వేగ నియంత్రణను ప్రదర్శించింది. ఈ సెన్సార్లను రోబోల లోపల ఉపయోగించారు. మోర్నిన్ రోబోట్ 3D LiDAR, డెప్త్, వైడ్-యాంగిల్ కెమెరాలు, విజువల్-లాంగ్వేజ్ మోడల్ (VLM)లను ఉపయోగించారు. ఈ సెన్సార్ల సహాయంతో, రోబోట్ డోర్ స్థానాన్ని, దానిని తెరవడానికి సరైన మార్గాన్ని అంచనా వేస్తుంది.
Also Read:MLC Kavitha: రేపటి నుంచే దీక్ష.. 72 గంటలపాటు నీళ్లు కూడా తాగకుండా..
రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ సహాయంతో, రోబోట్ డోర్ తెరవడం నేర్చుకుంది. ఈ రోబోట్ స్వతంత్రంగా పనిచేసింది. ఈ రోబోట్‌ను చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించడం ప్రారంభిస్తే, దాని కారణంగా చాలా మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాలెట్ పార్కింగ్ లేదా హోటళ్లలో పనిచేస్తున్నారు. వారి పని కార్ల డోర్లు తెరిచి అతిథులను స్వాగతించడం. మోర్నిన్ రోబోట్ లేదా రోబోలు ఇలా పనిచేయడం వల్ల ఈ లక్షలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చు. AiMOGA రోబోటిక్స్ మోర్నిన్ రోబోలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రోబోలను ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి వాటిల్లో సహాయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు.
