Asaduddin Owaisi: ఇది ఏఐ యుగం. ఏఐ ద్వారా జనరేట్ చేసిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఏది అడిగినా చెప్పేస్తుంది. క్షణాల్లో అద్భుతాలు చేస్తుంది. మాయా ప్రపంచాన్నే సృష్టిస్తుంది. అదీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సత్తా. ఇదంతా ఓ ఎత్తైతే.. రెండో కోణమూ ఉంది. ఏఐ జనరేటెడ్ ఫొటో, వీడియో.. వాస్తవమా? అవాస్తవమా అంటే టెక్ నిపుణులే తటపటాయించే పరిస్థితి. డీప్‌ఫేక్‌ను మించి కల్లోలం రేపుతున్న ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యంగా మారింది.
READ MORE: Old Woman Rides Bullet Bike: 60 ఏళ్ల వయస్సులో బుల్లెట్ బైక్ నేర్చుకున్న వృద్ధురాలు.. షాకవుతున్న యువత
అయితే.. తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒవైసీ హనుమాన్ మందిరంలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒవైసీ వెనకాల ఓ సెక్యూరిటీ సిబ్బంది, ముందర పంతులు కనిపిస్తున్నారు. ఈ వీడియోలో ఒవైసీ హనుమంతుడికి హారతి ఇస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. చాలా మంది దీన్ని చూసి నిజమేనని నమ్ముతున్నారు. కానీ. ఇది ఏఐ వీడియోగా పోలీసులు గుర్తించారు. మతవిద్వేశాలు రెచ్చగొట్టేలా ఉందంటూ.. హైదరాబాద్ నగర పోలీసుల కేసు నమోదు చేశారు. వీడియోను ఎవరు క్రియేట్ చేశారు? ఏ అకౌంట్‌లో తొలుత పోస్ట్ చేశారు అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో మతపరమైన అశాంతిని సృష్టించే లక్ష్యంతో ఈ కల్పిత వీడియోను వ్యాప్తి చేస్తున్నారని పోలీసుల చెబుతున్నారు.
READ MORE: TTD: బీహార్‌లో శ్రీవారి ఆలయం.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణం
