NTV Telugu Site icon

AIMIM: బీహార్, మహారాష్ట్రలో సైతం ఎంఐఎం పోటీ.. స్థానాలెన్నంటే.?

Aimim

Aimim

హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ నెమ్మదిగా దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. బీజేపీని కట్టడి చేసేందుకు మజ్లిస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ పరిస్థితుల కారణంగా మార్పులు చేయాల్సి వచ్చిందని పార్టీ ప్రతినిధులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఐదు, మహారాష్ట్రలో నాలుగు, తెలంగాణలోని హైదరాబాద్‌తో కలిపి మొత్తం పది లోకసభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు పేర్కొన్నారు. దేశంలో మతతత్వ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మజ్లిస్‌ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని ఆశించినట్లు తెలిపారు.

READ MORE: Thug Life : “థగ్ లైఫ్” స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. శింబు స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా…

మహారాష్ట్రలో సిటింగ్‌ సీటు ఔరంగాబాద్‌ నుంచి ఇంతియాజ్‌ జలీల్‌, పూణె నుంచి అనిస్‌ సుంద్కే, ఉస్మానాబాద్‌ నుంచి సిద్ధిఖీ ఇబ్రహీం, ముంబై సెంట్రల్‌ నుంచి రంజన్‌ చౌదరి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక బిహార్‌లో కిషన్‌గంజ్‌ నుంచి అక్తరుల్‌ ఇమాన్‌, హైదరాబాద్‌ నుంచి మజ్లిస్‌ అధినేత అసద్దుదీన్‌ ఒవైసీ పోటీ చేస్తున్నారు. అంతే కాకుండా మరో ఐదు లోకసభ స్థానాల నుంచి మజ్లిస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.

కాగా.. ఇప్పటికే ఎంఐఎం పార్టీ తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లో పలు పార్టీలకు మద్దతు ప్రకటించింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించగా.. ఉత్తర్ ప్రదేశ్ లో అప్నాదళ్‌(కే) తో జతకట్టింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఆ పార్టీకి గతంలో ఎంఐఎం మద్దతు ప్రకటించింది. గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. గత నెల ఏప్రిల్ లో ఎక్స్ వేదికగా ఒవైసీ మాట్లాడుతూ.. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని.. పొత్తు కొనసాగుతుందని తెలిపారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ ఆర్సీని వ్యతిరేకిస్తామని అన్నాడీఎంకే ప్రకటించడంతో ఎంఐఎం ఆ పార్టీకి మద్దతు ఇస్తోందన్నారు.