Site icon NTV Telugu

AIG Hospital: లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం AIG హాస్పిటల్ లో చేరిన వ్యక్తి.. రూ. 35 లక్షలు కట్టించుకుని.. చివరకు

Aig Hospital

Aig Hospital

వైద్యులను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఘటనలు వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయంటున్నారు పలువురు వ్యక్తులు. తాజాగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏఐజీలో చేరాడు. వైద్యం చేసేందుకు రూ. 35 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నారని బాధిత కుటంబం తెలిపింది. బాధితులు ఇల్లు అమ్ముకుని మరి హాస్పిటల్ లో లక్షల్లో బిల్లు చెల్లించామని తెలిపారు.

Also Read:Rashi Khanna : ప్రేమ కథల్లో చాలానే నటించా.. కానీ ‘తెలుసు కదా’ అనుభవం స్పెషల్‌!

అయినా ఆసుపత్రిలోని డాక్టర్లు తమ వ్యక్తిని కాపాడలేకపోయారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. రెండు రోజుల క్రితమే మరణించినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి కుటుంబసభ్యులు ఏఐజీ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version