ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్లాడుతూ.. లెఫ్ట్ పార్టీలతో అనధికారికంగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక చర్చలు మాత్రమే కొనసాగుతున్నాయి.. సీపీఐ, సీపీఎంతో మాట్లాడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంశం రాష్ట్ర స్థాయిలో చర్చలు జరగడం లేదు అని ఠాక్రే తెలిపారు.
Read Also: Pushpa The Rule : ఈ సారి సినిమాలో మరిన్ని యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్న సుకుమార్..?
వైఎస్ షర్మిల అంశం అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నాడు. ఒక్క బీఆర్ఎస్ కారులో బీజేపీ.. కేసీఆర్.. కవిత, కేటీఆర్.. హరీశ్ రావు ఐదుగురు ప్రయాణం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది అని మాణిక్ రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Reliance AGM: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా.. ఇషా, ఆకాశ్, అనంత్ ఇన్..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలక హామీలపై గ్యారంటీ కార్డు ఇస్తాం ప్రజలకు అని మాణిక్ రావు ఠాక్రే చెప్పాడు. ఇంటింటికి గ్యారెంటీ కార్డు తీసుకు వెళతాం.. బీసీలకు పార్లమెంట్ నియోజక వర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపాడు. త్వరలో మూడు డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
