NTV Telugu Site icon

AICC Secretary Sampath : జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్

Sampath

Sampath

మోడీ మాదిగలకు ఏం చేశారో మందకృష్ణ సమాధానం చెప్పాలన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం అడ్వకేట్ ని పెట్టి కొట్లాడుతుందని, మాదిగ బిడ్డను నేను.. నన్ను ఎమ్మెల్యే.. ఏఐసీసీ కార్యదర్శి ని చేసింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి జాతిని అంటగట్టే పనిలో మందకృష్ణ ఉన్నారని, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. కిషన్ రెడ్డి.. వెంకయ్య నాయుడుతో తిరిగి మందకృష్ణ కండ్లకు మసక పట్టిందన్నారు. దళితులు ఊరి చివర ఉండాలని చెప్పిన బీజేపీ కి ఎలా మద్దతు ఇస్తుందన్నారు. మాదిగ కోసం ఒక్కటైనా చేసిందా చెప్పు మందకృష్ణ అని ఆయన అన్నారు.

  BJP: బీజేపీ నాల్గో జాబితా విడుదల.. సీనియర్ నటి రాధిక ఎక్కడి నుంచంటే..!

ఉషా మెహ్రా కమిటీ 2005లో వర్గీకరణ కోసం వేసిందే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలపై వివక్షత చూపింది, ఆ రోజు రేవంత్ రెడ్డి మాత్రమే అసెంబ్లీలో నాతో గొంతు కలిపి వాణిని వినిపించాడని అన్నారు. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్‌లు మాదిగలకు తీరని ద్రోహం చేశాయని ఆరోపించారు. అలాంటి ద్రోహులతో కలిసి మాదిగ సామాజిక వర్గానికి మందకృష్ణ అన్యాయం చేస్తున్నాడని అన్నారు. మాదిగలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అక్కున చేర్చుకుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. సర్వే సత్యనారాయణ లాంటి వ్యక్తిని కేంద్రమంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మందకృష్ణ బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

Delhi liquor policy scam: మద్యం పాలసీలో ‘‘కింగ్‌పిన్’’ కేజ్రీవాల్.. కోర్టుకు తెలిపిన ఈడీ..