NTV Telugu Site icon

Rahul Gandhi: రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌‌ పర్యటన

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో రాహుల్‌ గాంధీ అంబట్‌పల్లికి చేరుకోనున్నారు. అంబట్‌పల్లిలో ఉదయం 7.30 గంటలకు నూతన గ్రామపంచాయతీ సమీపంలో మహిళా సదస్సులో రాహుల్‌ పాల్గొననున్నారు. సుమారు 5 వేల మంది మహిళలతో ఈ సభ జరగనుంది. ఆరు గ్యారంటీ పథకాలపై మహిళలకు రాహుల్‌ వివరించనున్నారు. సభ అనంతరం కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించనున్నట్లు సమాచారం. బ్యారేజ్ వద్ద 144 సెక్షన్‌ కొనసాగుతోంది.

Also Read: Yogi Adityanath: “తాలిబాన్‌లకు బజరంగ్‌బలి” పరిష్కారం.. యోగీ సంచలన వ్యాఖ్యలు..

రేపటి రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. నెల రోజుల వ్యవధిలో మంథనిలో పర్యటించడం రాహుల్‌కు ఇది రెండోసారి.