AICC Holds Introspection Meeting: బీహార్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా “ఏఐసిసి” అధిష్ఠానం ఆత్మశోధన నిమిత్తం సమావేశం నిర్వహించింది. “ఏఐసిసి” అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అగ్ర నేత రాహుల్ గాంధీ తోపాటు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ అంశంపై గంటకు పైగా సమాలోచనలు కొనసాగాయి.. సమావేశంలో వాడి వేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి, ప్రధాని మోడీ చేసిన తీవ్ర విమర్శలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆత్మశోధనలో మునిగిపోయింది. ఊహించని ఫలితాలతో తీవ్ర నిరాశకు గురయ్యారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు..
READ MORE: Oats Side Effects: రోజు టిఫిన్ లో ఓట్స్ తీసుకుంటున్నారా.. అయితే బీకేర్ ఫుల్…..
భేటీ అనంతరం.. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడకుండా “మౌనంగా” వెళ్ళి పోయారు. “రాష్ట్రీయ జనతా దళ్” (ఆర్.జే.డి) నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడారు. అలాగే, “మహాఘఠ్ బంధన్” లోని ఇతర సహచర భాగస్వామ్యపక్షాల నేతలతో సైతం రాహుల్ ముచ్చటించారు. అయితే.. ఈ భేటీపై కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, అజయ్ మెకన్ మీడియా సమావేశంలో ప్రసంగించారు. “కేంద్ర ఎన్నికల సంఘం” చేపట్టిన “ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన, పునఃపరిశీలన” కార్యక్రమం (సర్)తో పాటు, పలు విధాలుగా “ఓట్ చోరీ” (ఓట్ల దొంగతనం) జరిగిందని విమర్శించారు.. 15 రోజుల్లో పూర్తి సమాచారం సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
